తెలంగాణ కెరటం ,ఇబ్రహీంపట్నం, ఏప్రిల్11
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్ర సమీపంలో బిజెపి పార్లమెంట్ ఎన్నికల ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం బుధవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేష్ పాల్గొన్నారు. ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్ని యాదగిరి రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితులు ఉన్నాయని దేశంలో 548 పార్లమెంటు సీట్లకు 38 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని, అన్ని సర్వేల రిపోర్టల ప్రకారం బిజెపి గెలుపు ఖాయమని నరేంద్ర మోదీకి భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ ను గెలిపించి కానుకగా ఇద్దామని, పార్లమెంటులో బూర నర్సయ్య గౌడ్ ఉంటేనే భువనగిరికి అందం అని అన్నారు. రాజకీయ రంగంలో గెలవాలి అనే కసితో పని చేయాలని జైశ్రీరామ్ అని నినాదం లేకపోతే హిందువులుగా బతికి ఏం లాభమని, మానాలు ప్రాణాలు పోయినంక అన్నం ఎందుకని ఆయన ఏదెవ చేశారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానన్న ఎన్నికల వాగ్దానం ఏమైందని, మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చినది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు నెలల నుండి పేద ప్రజలకు ఏం చేశారు.ఆయన మాత్రం నిగనిగలాడే నల్లని కార్లలో తిరగడం తప్ప ధర్మం కోసం పనిచేసే పార్టీ బిజెపి పార్టీ అని ఆ ధర్మాన్ని రక్షించకపోతే ఇంకా ఏముందని తెలిపారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లేనని కాంగ్రెస్ పార్టీ అంటేనే కష్టం, ఇప్పుడున్న పరిస్థితులలో రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు. దేశంలో 400 సీట్లు బిజెపి కైవసం చేసుకుంటుంది. అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు నిధులు లేవు లంకె బిందెలు లేవు అని అభివృద్ధిని కుంట్టు పరుస్తున్నారని, రాష్ట్రంలో లంకె బిందెలు రావాలి అంటే పార్లమెంటులో బిజెపి గెలవాలి. రాష్ట్రంలో ముఖ్యంగా 10 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవాలి అంటే బిజెపి అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, మాజీ అధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు బోసుపల్లి ప్రతాప్, పెద్దపల్లి ప్రబారి కొప్పు భాష, నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర నాయకులు నాయిని సత్యనారాయణ, జక్క రవీందర్ రెడ్డి, టేకుల రామ్ రెడ్డి,మండల అధ్యక్షులు దండే శ్రీశైలం, మున్సిపల్ అధ్యక్షులు బూడిద నర్సింహారెడ్డి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.