Saturday , October 5 2024

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 09

పి ఆర్ టి యు తెలంగాణ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పి ఆర్ టి యు తెలంగాణ పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వ్యవస్థాపక సభ్యులు మంచి రెడ్డి అనంత రెడ్డి, రాష్ట్ర సంఘ సలహాదారు గజ్జల జనార్ధన రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీశైలం, అచ్చన మల్లేష్, ఆర్థిక కార్యదర్శి వెంకట చక్రపాణి,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శిలింగస్వామి కుల్కచర్ల మండల అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. సంఘ సీనియర్ నాయకులు,వ్యవస్థాపక సభ్యులు అయినా మంచిరెడ్డి అనంతరెడ్డి, గజ్జల జనార్దన్ రెడ్డి ని సన్మానించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, పి ఆర్ టి యు తెలంగాణ ఉపాధ్యాయ సంఘం 2011 ఏప్రిల్ 9న ఏర్పడింది. అప్పటినుండి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా పనిచేస్తున్నదని తెలిపారు.