Sunday , May 26 2024

బీరప్ప దేవాలయాన్ని దర్శించుకున్న నిట్టు శ్రీశైలం

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 09

ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప స్వామి కామరతి దేవాలయం దర్శించుకొని, బీరప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరి కోరికలు తీరాలని,ప్రజలందరూ సుఖ సంతోషాలతో చీకట్లు తొలిగి ఆనందాల ఉషోదయం కావాలని ప్రార్ధించిన బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ దండుమైలారం లోని శ్రీ శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప స్వామి కామరతి దేవాలయం వద్ద ఉగాది పుష్కరాలలో బాగంగా బీరప్ప స్వామి కామరతి వారికి పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్దకుర్మ, మాజీ సర్పంచ్, నిట్టు నర్సింహ, సెల్విఓజి మంగ శ్రీశైలం, పెద్ద గొల్ల ముద్దం యాదయ్య యాదవ్ కురుమ సంగం అధ్యక్షుడు నిట్టు మల్లేష్, ఉపాధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో పంచాంగ కార్యక్రమం గ్రామ పంతులు బహుగుణ రాఘవేందర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు మంగ వెంకటేష్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మంగ ఐలేష్ కురుమ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నిట్టు గాలయ్య, గ్రామపంచాయతీ మాజీ సభ్యులు నిట్టు బీరప్ప, చిట్టె శ్రీశైలం, నిట్టు శ్రీశైలం(పెద్ద),బీర్ల శివయ్య, మల్లా శ్రీను, నిట్టు మినయ్య, రావుల జంగయ్య,పట్నం శ్రీశైలం, మంగ శ్రీను,సుబ్బురు బాలయ్య, సుబ్బురు వెంకటేష్, బీర్ల బాలప్ప, కురుమ గొల్ల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.