Wednesday , July 24 2024

ఏప్రిల్ 10న 5కె రన్

తెలంగాణ కెరటం, ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 08

ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగం పల్లి జోన్ లో ఈనెల 10న ‘నేను తప్పకుండా ఓటు వేస్తాను,ఐ ఓటు ఫర్ సూర్ అనే నినాదంతో 5కె రన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.ఏప్రిల్ 10న ఉదయం 6 గంటలకు 5కె రన్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుండి ప్రారంభమై, హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు వెళుతుందని పేర్కొన్నారు.అన్ని వర్గాల వారు స్వచ్చందంగా 5కె రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటాలని, వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని
విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5కె రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఇ ఓ వికాస్ రాజ్, జి హెచ్ ఏం సి కమిషనర్ రోనాల్డ్ రోస్, జాయింట్ సి ఇ ఓ సర్పరాజ్ అహ్మద్, తదితరులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.