Wednesday , July 24 2024

వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి..!

ఫిజికల్ డైరెక్టర్ తోగుట రవీందర్

తెలంగాణ కెరటం:(దుబ్బాక),మార్చి02 :
తెలంగాణ మన రాష్ట్రం మనకు వచ్చినా కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటినుండి ఇప్పటివరకు మా వ్యాయామ ఉపాధ్యాయులను మోసం చేస్తూ పిల్లలు ఆరోగ్యలతో చెలగాటం ఆడుతున్నారని ఫిజికల్ డైరెక్టర్ తోగుట రవీందర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… హైస్కూల్లో గాని ప్రైమరీ స్కూల్లో గాని జూనియర్ కాలేజీలో గాని డిగ్రీ కాలేజీలో కానీ పిల్లలు మాత్రం పేరుకు మట్టుకు ఆరోగ్యంగా ఉండాలి దాని సంబంధించిన పోస్టు వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు ఉన్నార ఆ పోస్టులు వెయ్యాలని గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆలోచన లేదు ఇది సిగ్గుచేటు ప్రస్తుతం 1512 పోస్టులు ఖాళీగా ఉన్న 167 కి నోటిఫికేషన్ వేయడం అత్యంత బాధాకరం విద్య సంస్థలలో ప్రస్తుతం ఉన్న ఖాళీలు 194 మోడల్ స్కూల్ లో ఒక్కరు లేరు 15,322 ప్రైమరీ స్కూళ్లలో అదే పరిస్థితి,3,145 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలలో 303,డిగ్రీ కళాశాలలో 110 పోస్టులు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. శారీరకంగా పిల్లల ఎదుగుదలకు ఎంతో విధంగా కృషి చేసే వ్యాయామ ఉపాధ్యాయుడు పోస్టులను ఈ ప్రభుత్వం కూడా భర్తీ చేయకపోవడం చాలా బాధాకరం గత ప్రభుత్వం అవినీతి పాలనలో మా వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులను విడుదల చేయలేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు పెద్ద ఎత్తున భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతో ముఖ్యం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఎక్కువగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము స్పందించని యెడల మేము అసెంబ్లీని ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.