Monday , September 16 2024

లచ్చపేట లో ఘనంగా మార్కండేయ స్వామి 28వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి02:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డు లో శనివారం పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి 28వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రుద్రాభిషేకం, అర్చనలు, హోమము తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు ధరణినాథ్ శర్మ తెలిపారు.ఈ వార్షికోత్సవ వేడుకల్లో పద్మశాలి సమాజం అధ్యక్షుడు బడుగు రాజు, లచ్చపేట 10, 11 వార్డుల కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య ,నందాల శ్రీజ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ కళ్యాణం రమేష్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గిరిధర్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజం పెద్దలు తాళ్ల లక్ష్మీనరసయ్య, ఎర్రగుంట ప్రసాద్, శ్రీనివాస్, పాండురంగం,కమిటీ సభ్యులు చెలిమెల్ల రాజేశం, కొండ శంకర్ ,బిల్ల రవికుమార్, కూరపాటి రవికాంత్, కూరపాటి నాని ,యువజన సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.