దుబ్బాక:మే20,(తెలంగాణ కెరటం)
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరానికి బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు, ఉపాధ్యక్షులు దొమ్మాట జోగయ్య, క్యాషియర్ ఇస్తారిగళ్ల యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ, జనతా హాస్పిటల్ ఎంబిబిఎస్ డాక్టర్ సౌజన్యంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల అందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సుందరయ్య తన జీవితాంతం కూడా సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా కుల ఆసమానుతులకు వ్యతిరేకంగా పనిచేసిన గొప్ప నాయకుడని ఆయన ఆశయ సాధనలో భాగంగా కాలనీలో ఈ ఆరోగ్య ఉచిత శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారిగల్ల ఎల్లం. బెల్లె బాల్ నర్సు,సిపిఎం నాయకులు కొంపల్లి భాస్కర్, లక్ష్మీనారాయణ ,రాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.