Wednesday , July 24 2024

టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఎల్లన్నగారి కొండల్ రెడ్డిని సన్మానించిన

అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

దుబ్బాక:మే13,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూంపల్లి గ్రామానికి చెందిన ఎల్లన్న గారి కొండల్ రెడ్డి ని ఆదివారం రోజున అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మెర శ్రీధర్, బేగంపేట తాజా మాజీ సర్పంచ్ ప్రతాప్, టెలికాం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూంపల్లి భీంరావు, పి.దయాకర్ రెడ్డి, రమేష్, కె జగన్, కే రవీందర్, ఎల్లన్న గారి వంశీ, ఎల్లన్న గారి మధుసూదన్ రెడ్డి, అబ్బుల మమ్ముగౌడ్, శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.