Sunday , May 26 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి

దుబ్బాక:మే13,(తెలంగాణ కెరటం)

-విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దు

-రూట్ మొబైల్ లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద 24X7 వాహనాలు పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి.పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ సామాగ్రిని వదిలి వెళ్ళవద్దురూట్ మొబైల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి, క్యూఆర్టి, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి తెలంగాణ మోడల్ స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లచ్చపేటలో సోమవారం నిర్వహించవలసిన విధుల గురించి దిశా నిర్దేశం చేసిన

-అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి
దుబ్బాక సర్కిల్ పరిధిలో ఉన్న రూట్ మొబైల్ పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి, క్యూఆర్టి, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ అధికారులకు సిబ్బందికి తెలంగాణ మోడల్ స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లచ్చపేటలో ఆదివారం రోజున,సోమవారం రోజున నిర్వహించవలసిన విధుల గురించి దిశా నిర్దేశం చేసిన అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ట్రైనింగ్ నుండి వచ్చిన ఎస్ఐలు, కానిస్టేబుళ్లకు మీ సర్వీసులో మొదటి అనుభవం సర్వీస్ మొత్తం గుర్తుండి పోతుందని ఎవ్వరు కూడా ఓన్ డిసిషన్ తీసుకోవద్దని ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వెంటనే తెలియపరచాలని సూచించారు.
ప్రతి ఒక్కరికి డ్యూటీ టికెట్ తో పాటు ఆదివారం, సోమవారం నిర్వహించే విధుల గురించి బుక్ లెట్ ఇవ్వడం జరిగింది.ఒకసారి ప్రతి ఒక్కరూ ఆ బుక్ లెట్ ను చదువుకొని రేపు ఎల్లుండి నిర్వహించవలసిన విధులు ప్రతి ఒక్కరూ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ఈవీఎం, వివి ప్యాడ్ మరియు ఎన్నికల సామాగ్రి రక్షణ పూర్తి బాధ్యత రూట్ మొబైల్ అధికారులదని సూచించారు.రూట్ మొబైల్ లో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద 24X7 వాహనాలు పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి.సంబంధిత రూట్ మొబైల్లో ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు.రూట్ మొబైల్ కు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే వెంటనే అక్కడికి చేరుకొని పరిష్కరించాలని, ఆ విషయము వెంటనే సంబంధిత పోలీస్ ఉన్నత అధికారులకు తెలుపాలని సూచించారు.విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దన్నారు.రాబోయే 48 గంటలు చాలా ముఖ్యమని తెలిపారు.పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ సామాగ్రిని వదిలి వెళ్ళవద్దని తెలిపారు.ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామాలలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియపరచాలని సూచించారు.ప్రతి ఎన్నిక ఒక కొత్త అనుభవాన్ని నేర్పిస్తుందన్నారు.
అధికారులు సమిష్టిగా సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు.జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున అయిదురు కానీ అంతకంటే ఎక్కువ మంది గుమికూడా వద్దని సూచించారు.ప్రజలు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటు వేసే విధంగా అన్ని రక్షణ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు, భూంపల్లి ఎస్ఐ రవికాంత్, మిరుదొడ్డి ఎస్ఐ పరశురామ్ రూట్ మొబైల్ అధికారులు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.