Tuesday , July 16 2024

కామారెడ్డిలో చెల్లనికేసీఆర్ తెలంగాణలో ఎలా చెల్లుతాడు – బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

దుబ్బాక:మే09,(తెలంగాణ కెరటం)
కామారెడ్డిలో చెల్లని కేసీఆర్ తెలంగాణలో ఎలా చెల్లుతాడని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు.’కేసీఆర్ అంటేనే అబద్ధం’ అని ,గెలవడం చేతకాక ప్రజల్ని మోసం చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ అంబేద్కర్ విగ్రహ చౌరస్తా నుండి దుబ్బాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్దకు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు గురువారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం రఘునందన్ రావు మాట్లాడారు.తాను ఎమ్మెల్యేగా గెలిచాకే దుబ్బాకలో బస్టాండ్ కట్టించానని,తన శ్వాస దుబ్బాక ప్రజల సేవ కే అంకితమన్నారు.డిపాజిట్ రానోళ్లు రిబ్బన్లు కట్ చేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.దేశంలో ఏ కలెక్టర్ దగ్గర కూడా రూ.లక్ష కోట్లు లేవని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల అనంతరం వెంకట్రామారెడ్డి తిన్నదంతా కక్కిస్థానని హెచ్చారించారు.మల్లన్నసాగర్ పేరిట వందల కోట్లు మింగిన వెంకట్రామారెడ్డి ని ఓడించి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంబటి బాలేష్ గౌడ్,బీజేపీ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు కిష్టమ్మగారి సుభాష్ రెడ్డి,అరిగె కృష్ణ,ఎస్ఎన్ చారి,చింత సంతోష్ కుమార్,తిరుమల్ రెడ్డి,
సుంకోజు ప్రవీణ్ కుమార్,పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.