Monday , September 16 2024

నీలం మధు ను గెలిపించండి మెదక్ నియోజకవర్గంను అభివృద్ధి చేసి చూపిస్తాం

దుబ్బాక లో 50 వేల మెజార్టీ నీలం మధుకు ఇస్తే చెరుకు శ్రీనివాస్ రెడ్డితో అభివృద్ధి కోసం కొట్లాడుతాడు

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

దుబ్బాక:మే07,(తెలంగాణ కెరటం దుబ్బాక)
ఎన్నికల ప్రచారం లో భాగంగా దుబ్బాక మండలం హబ్సీపూర్ నుండి దుబ్బాక వరకు నిర్వహించిన కాంగ్రెస్ బైక్ ర్యాలీ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర నిధులన్ని దుబ్బాక కు తీసుకపోతుండని గతంలో చెరుకు ముత్యంరెడ్డి ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే అనేది అన్నారు.అలాంటి నాయకుడి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని దుబ్బాక ప్రజలు ఓడగొట్టడం బాధాకరం అన్నారు.రెండు సార్లు రైతు రుణ మాఫీ చేయడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మేము కెసిఆర్ కు దీటుగా ఆగస్టు 15లోగ రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి దిగిపోయిండు కెసిఆర్ అన్నారు.పది సంవత్సరాలు ఎంపీ గా ఉండి ఏం చేయలేని కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక లో గెలిపించడం విచిత్రం అని అన్నారు.కేంద్రంలో రాహుల్ ప్రధాని అయితే బిడి కార్మికుల కు పుర్రె గుర్తు లేకుండా చేపిస్తా కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు తో కాని పనులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి తో చేపిస్తా అన్నారు. దుబ్బాక లో 50 వేల మెజార్టీ నీలం మధుకు ఇస్తే చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి కోసం కొట్లాడుతాడు, నేను అండగా ఉంటా అన్నారు.దుబ్బాక కు ఎమ్మెల్యే క్యాండేట్ ఎల్లప్పుడూ చెరుకు శ్రీనివాస్ రెడ్డే ఉంటాడు.పది సంవత్సరాల బిజెపి ప్రభుత్వం లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ, రఘునందన్ గానీ దుబ్బాక కు చేసింది ఏమీ లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో పోలీస్ అరాచ్ మెంట్ ఉండదు అన్నారు.గత ప్రభుత్వం పోలీసులను వాడుకుంది, మాట్లాడితే కేసులు పెట్టిచ్చింది అని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.