Sunday , May 26 2024

ఈవీఎం కమీషనైసింగ్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి

జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

దుబ్బాక:మే04,(తెలంగాణ కెరటం)
ఈవీఎం కమీషనైజింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ లో జరుగుతున్న ఈవీఎం కమిషనైజింగ్ ప్రక్రియను శనివారం నాడు దుబ్బాక ఏఆర్ఓ , జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ తో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎం కమీషనైసింగ్ చేస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విధులను అత్యంత జాగ్రత్త నిర్వహించాన్నారు. ఈవీఎం కమిషానైసింగ్ ప్రక్రియ నేటితో పూర్తవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక ఏ ఏ ఆర్ ఓ వెంకటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.