Monday , September 16 2024

మెదక్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం

బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరాంరెడ్డి భారీ మెజారిటీ తో గెలుపు ఖాయం

దుబ్బాకలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన

బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్

దుబ్బాక:మే04,(తెలంగాణ కెరటం) మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పేద ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి వెంకట్రామ్ రెడ్డి అని బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అన్నారు. శనివారం రోజున దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నే వనిత భూమిరెడ్డి తో కలిసి దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 17,18,వార్డులల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కత్తి కార్తీక గౌడ్ మాట్లాడుతూ, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చెందాలంటే వెంకట రామిరెడ్డి తో నే సాధ్యమని అన్నారు. మెదక్ ఉమ్మడి జిల్లా పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి వెంకట రాంరెడ్డి అని గుర్తు చేశారు. పేద విద్యార్థుల కోసం వంద కోట్లు విఆర్ఆర్ ట్రస్టు కు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వెంకట రాంరెడ్డికి లక్ష మెజార్టీ రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పులిగారి కల్పన ఎల్లం, బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రాజు,ఆంజనేయులు,ప్రశాంత్, నరేష్,పండు,నాగరాజు, చందు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.