Monday , September 16 2024

వెంకట్రామిరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం

పివిఆర్ ట్రస్ట్ వాలింటర్స్ సమావేశంలో పాల్గొన్న

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
-బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి

దుబ్బాక:ఏప్రిల్28:(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని భూంపల్లి -అక్బర్ పేట మండల పరిధిలో గల రామలింగేశ్వర ఫంక్షన్ హల్ లో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి పివిఆర్ ట్రస్ట్ వాలింటర్స్ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు అభినందించదగ్గ విషయమని, దుబ్బాక నియోజకవర్గంలో ఈ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలు ముందు ముందు చాలా జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన తెలియజేశారు. అలాగే వెంకట్రామిరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి తెలియజేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి హాజరై పివిఆర్ ట్రస్టు భవిష్యత్తులో చేయబోయే సేవ కార్యక్రమాలు, ఒక రూపాయికి ఫంక్షన్ హాల్,నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు సహాయం, మరియు వారికి పోటీ పరీక్షల నిమిత్తం కోచింగ్ సెంటర్లు, పేద కుటుంబాలకు చేయబోయే సహాయకార్యక్రమాల గురించి వివరించండం జరిగింది.వాలంటీర్లకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గంకి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం సమన్వయకర్త బొంపల్లి మనోహర్ రావు మరియు నియోజకవర్గ స్థాయిలో ప్రతి బూతు నుండి పివిఆర్ ట్రస్ట్ వాలంటీర్లు మరియు నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.