Saturday , October 12 2024

బీసి బిడ్డను ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా

-పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ

-మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్19:
దుబ్బాక-అక్బర్పేటభూంపల్లి మండలంలోని ఎస్బీఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి నియోజకర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, జరగబోయె పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల నుంచి పోటి చేస్తున్న తనను భారీ మెజార్జితో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టి పేదల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కి దక్కుతుందన్నారు. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టి యెనని పేర్కొన్నారు. గతంలో మెదక్ నుంచి ఎంపిగా పోటి చేస్తే స్వర్గియా ఇంధీరాగాంధీని భారీ మెజార్టితో గెలిపించిన ఘతన మెదర్ ప్రజలకు ఉందని. గుర్తు చేశారు. సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంట్రామిరెడ్డి బారి కుంభ కోణం చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపిగా పోటి చేయడం సిగ్గు చేటన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డగోలు అవినీతికి పాల్పడి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గత ఉప ఎన్నికల్లో మాయ మాటలతో ఎమ్మెల్యేగా గెలిచి చేసిందేమి లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపికి ఒక్క ఓటు వేయకూడదన్నారు. బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని ఆ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పె రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బారీ మెజార్టితో గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి హరీశ్ రావు దుబ్బాకకు వచ్చే నిధులన్ని సిద్ధిపేటకు తరలించాడని మండిపడ్డారు. హరీశ్ రావు చేసిన కుంభకోణాలు త్వరలోనే బయటపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల్నర్సాగౌడ్, వెంకటస్వామిగౌడ్, నాయకులు సల్కం మల్లేశం,రాజిరెడ్డి,కొంగరి రవి,శ్రీనివాస్,కాల్వ నరేష్, మచ్చ శ్రీనివాస్, చంద్రరెడ్డి,పద్మయ్య,ఆకుల భారత్, శేఖర్,అన్ని మండలాల అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.