-మెదక్ నియోజకవర్గ అభివృద్ధి రఘునందన్ రావుతోనే సాధ్యం
-బీజేపీ సీనియర్ నాయకులు తొగుట రవీందర్
తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్19:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి 5వ వార్డు బూతు లో శుక్రవారం రోజున మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా బీజేపీ సీనియర్ నాయకులు తొగుట రవీందర్ ఆధ్వర్యంలో రఘునందన్ రావు గెలుపు కొరకై బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి స్టిక్కరింగ్ చేయడం జరిగింది అని తెలిపారు.ఈ సందర్భంగా తొగుట రవీందర్ మాట్లాడుతూ, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపుతోనే మెదక్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని,కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు నాగరాజు, మద్ది సంతోష్,శ్రావత్ రెడ్డి, అనీల్. కారణాకర్, ఎద్దు మహేష్,త్రినేష్ తదితరులు పాల్గొన్నారు.