Tuesday , July 16 2024

బీజేవైఎం దుబ్బాక పట్టణ అధ్యక్షుడిగా పల్లె నిహాల్ గౌడ్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్13
దుబ్బాక మున్సిపల్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులుగా పల్లె నిహాల్ గౌడ్ ని నియమిస్తూ బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కిష్టంగారి సుభాష్ రెడ్డి శనివారం రోజున నియామక పత్రం ని నిహాల్ గౌడ్ కు అందజేశారు.ఈ సందర్భంగా పల్లె నిహాల్ గౌడ్ మాట్లాడుతూ, తన పై నమ్మకం ఉంచి తనకు ఇచ్చిన బాధ్యతను పార్టీ ఎదుగుదలకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ను గెలిపించే విధంగా మున్సిపల్ లో తన వంతు శయశక్తుల కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ అధ్యక్షునిగా నియమించిన మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డికి సహకరించిన మాధవనేని రఘునందన్ రావుకి అంబటి బాలేష్ గౌడ్ , దూలం వెంకట్ గౌడ్, సుంకోజి ప్రవీణ్ ,రమణ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు.