Saturday , October 12 2024

ఎవరెన్ని కుట్రలు చేసినా మెదక్ లో ఎగిరేది బీజేపీ జెండానే

-మెదక్ పార్లమెంటు బిజేపి అభ్యర్థి రఘునందన్ రావు

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్10:
దుబ్బాక.ఏప్రిల్10. ఎవరెన్ని కుట్రలు చేసినా మెదక్ లో ఎగిరే ది బిజేపి జెండా నే అని గెలిచేది నేనే అని మెదక్ పార్లమెంటు బిజేపి అభ్యర్థి రఘునందనరావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బుధవారం తన స్వంత గ్రామ మైన బొప్పాపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల పైన ప్రజలకు నమ్మకం పోయిందని ,ఆరెండు పార్టీలను ప్రజలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ని ప్రజలు గత ఎన్నికల్లో చిత్తు గా ఓడించి కనుమరుగు చేశారన్నారు. ఆరు గ్యారంటీల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నేటి వరకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలే క ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. మెదక్ పార్లమెంటు బిజేపి అభ్యర్థి గా పోటీచేస్తున్న మీ రఘునందన్ రావు ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల గొంతుక వుతానన్నారు.ఆయన వెంట బిజే పి నాయకులు ,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.