Wednesday , July 24 2024

నిరుపేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుంది

-బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ చైర్మన్ ఎండి. చాంద్ మియా

తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్08:
నిరుపేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని , మానవసేవయే మాధవ సేవగా భావించి నిరుపేదలకు ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తున్నామని బిస్మిల్లా బైతుల్మాల్ ట్రస్ట్ చైర్మన్ ఎండి చాంద్ మియా అన్నారు. సోమవారం రోజున దుబ్బాక పట్టణంలో బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిరుపేదముస్లింలకు రంజాన్ కానుక తోఫా 55 మందికి అందించడం జరిగింది. ఇందులో సుమారు 27 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.మరియు అదే విధంగా 500 రూపాయలు ఒక చీర కూడా అందించడం జరిగింది అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేదలకు చేయూతనందిస్తామని అన్నారు. దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ సేవలను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ ఎండి ఖదీర్ అలీ, ఎండి షబ్బీర్ మియా,ఎండి చాంద్,ఎండి మజర్ అలీ ,అలీం,ఎండి షామెషీర్,ఎండి జమీర్,ఎండి సమీర్,ఫౌజియ తబస్సుం తదితరులు పాల్గొన్నారు.