తెలంగాణ కెరటం:(దుబ్బాక)ఏప్రిల్08:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తునికి సురేష్, 14వ వార్డుకు చెందిన మాడుగుల ఎల్లం, కడవెరుగు గోపి సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అనంతరం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అనంతరం వారికి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు తాము కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.