Saturday , October 5 2024

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం

పద్మశాలి సంఘo అధ్యక్షుడు గాజుల తిరుపతి

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి16:
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శనివారం రోజున
పద్మశాలి సంఘo ఆవరణలో పద్మశాలి సంఘo సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
పద్మశాలిల అనేక సంవత్సరాల కల పద్మశాలి కార్పొరేషన్ అని వారు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినఅనాది కాలంలోనే పద్మశాలిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు.రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపద్మశాలిల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిందం మల్లేశం, చెరుకు కాశయ్య, కారంపూరి లక్ష్మీనారాయణ ,కారంపూరి రాజు,గొనె మధు, శ్రీకాంత్ ,తిరుపతి, వడ్లకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.