Wednesday , September 18 2024

అంబేద్కర్ సంఘం అధ్యక్షుడిగా “ కాల్వ లింగం ”

తెలంగాణ కెరటం (దుబ్బాక)ఫిబ్రవరి 25:
దుబ్బాక పట్టణ అంబేద్కర్ సంఘం ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా కాల్వ లింగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులుగా 14 వ వార్డు కౌన్సిలర్ ఆస యాదగిరి, ఉపాధ్యక్షులుగా బావాజీ రమేష్ , ప్రధాన కార్యదర్శిగా అస రాజశేఖర్, సహాయ కార్యదర్శిగా బావాజీ శ్రీనివాస్, కోశాధికారిగా ఆశ ప్రభాకర్ , గల్లి పెద్దలుగా ఆస వినోద్, తలారి రవి, నారం రామస్వామిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.