–చలివేంద్రం ప్రారంభించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి జయలక్ష్మి
తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి16:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సిఐటియు ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ పి జయలక్ష్మి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సిఐటియు కార్మిక సంఘం కార్మికుల హక్కుల కోసం నిరంతరంగ సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ అనేక రకాల హక్కుల సాధించిపెట్టిన చరిత్ర సిఐటియు కు ఉన్నదని తెలిపారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రజలను ఆదుకోవడం కోసం అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా అందించిన చరిత్ర సిఐటియు ఉన్నదని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో వేసవికాలం ప్రారంభమైన సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు సిఐటియు దుబ్బాక మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు.గతంలో కూడా ఈ ప్రాంతంలో అంబలి కేంద్రం నిర్వహించి ప్రజలకు సేవలందించడం జరిగిందని గుర్తు చేశారు. నిరంతరం ప్రజలలో భాగమై పనిచేస్తున్న సంఘం సిఐటియు ను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.ఈ యొక్క చలివేంద్రాన్ని దుబ్బాకకు వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్న ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఎండాకాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రత పెరిగిందని రాబోవు రోజుల్లో మరింత ఎండలు తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం వైపు నుంచి కూడా మంచినీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జి.భాస్కర్ సిఐటియు నాయకులు సాజిద్, రాజు ,సాదిక్ ,వసంత, మంజుల రజియా విజయ శారద చంద్రకళ ,బాబాయ్ ,స్వరూప, సంతోష తదితరులు పాల్గొన్నారు.