Wednesday , July 24 2024

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేసిన మున్నూరు కాపు సంఘం నాయకులు

దుబ్బాక మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

మున్నూరుకాపు సంఘం అధ్యక్షడు ఆకుల శ్రీనివాస్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి16:
సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వెనుకబడ్డ బిసి కులాల అభివృద్ధికి కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం లో బాగంగా మున్నూరు కాపు ల అభివృద్ధికి కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం దుబ్బాక పట్టణంలో మున్నూరుకాపు సంఘం కార్యాలయం ముందు సిఎం రేవంత్ రెడ్డి,మంత్రులు కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డిల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు . ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం అధ్యక్షడు ఆకుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల మాట్లాడుతూ, గత ప్రభుత్వం మున్నురుకాపుల అభివృద్ధికి ఏనాడూ కృషిచేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్నూరు కాపుల అభివృద్ధికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల వారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మున్నూరు కాపుల మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నురుకాపు కుల సంఘం సభ్యులు చెల్లాపురం కిషన్,శెట్టి బుచ్చి రాములు, బండి రాజు,యాట లక్ష్మయ్య,కొట్టే బా లురెడ్డి, బండి వెంకటయ్య, నక్క శ్రీనివాస్, ఆకుల సత్తయ్య,బండి ప్రభాకర్, తేలు హన్మండ్లు, ఆధారి వెoకటి, కొట్టే నారాయణ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధారి వెంకట్(12 వార్డు) కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల భరత్, నక్క బాల వెంకన్న, కీసర శ్రీను, బండి రాములు మండల నాయకులు మంద శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.