Wednesday , July 24 2024

ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వండి

బిఎస్ పి తెలంగాణ అద్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని కోరిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి09:
గత 30 ఏళ్లుగా దళిత బడుగు బలహీన వర్గాల, బీసీల, మైనారిటీ సంక్షేమ ము కోసం పోరాటం చేసిన తమకు మద్దత్తు ఇవ్వాల్సిందిగా బిఎస్ పి తెలంగాణ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని శనివారం రోజున బిఎస్ పి పార్టీ కార్యాలయం లో కలిసి మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బిరయ్య యాదవ్ కోరడం జరిగిందన్నారు.దీనికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సానుకూలంగా స్పందించి తమకు మద్దతు గా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. సానుకూలంగా స్పందించి మద్దతు ఇచ్చినందుకు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీరయ్య యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి చర్చించడం జరిగిందన్నారు.
బీ ఆర్ ఎస్ తో బిఎస్ పి పొత్తును స్వాగతించడం జరిగింది.
ఇది మాన్యశ్రీ కాన్షిరాం ఆలోచన కు దగ్గర ఉందని భవిష్యత్తు లో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కేసీఆర్, ప్రవీణ్ కుమార్ పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.