Wednesday , September 18 2024

ఆడపిల్ల బరువు కాదు .. ఆడపిల్ల బహుమానం

-కత్తి కార్తిక గౌడ్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి07:
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజవర్గంలో జన్మించిన మొదటి ఆడబిడ్డకు టీం-కార్తిక ఫౌండేషన్ ద్వారా 5000/- రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్) కార్తిక అక్క తోబుట్టు కార్యక్రమంలో భాగంగా టీం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్తి కార్తిక గౌడ్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కొరివి శిరీష పరశురామ్ ల దంపతులకు తొలి ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా పాప పేరు మీద 5000/- రూపాయల పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను వారికి గురువారం రోజున కత్తి కార్తీక గౌడ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెరుగు పర్వతాలు (మాజీ సర్పంచ్), పాతూరి మోహన్ రెడ్డి (బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు), బాపిరెడ్డి, దేవేందర్ రెడ్డి, మహేందర్, రాజు, మూగల దేవయ్య రాగుల సిద్ధిరాములు గౌడ్(గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు),కొత్త దేవి రెడ్డి(సీనియర్ నాయకులు),రెడ్డి బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.