Sunday , May 26 2024

కరాటే మాస్టర్ కి సన్మానం

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి07:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు సిహెచ్. ఉషా కిరణ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు ,అఘాయిత్యాలను ఎదుర్కోడానికి నేటి సమాజంలో విద్యార్థులకు కరాటే ఎంతో అవసరమని,తమ పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా కరాటే శిక్షణ అందిస్తూ, భవిషత్లో వారికీ కరాటే శిక్షణ దోహదపడేందుకు తన వంతు కృషి చేస్తున్న
మాస్టర్ బురాని శ్రీకాంత్ ని ప్రధానోపాధ్యాయులు సిహెచ్. ఉషా కిరణ్, సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు.అనంతరం గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు,సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో
పాఠశాల సిబ్బంది కీర్తి, రవి, పిడి పద్మ, పిడి మమత తదితరులు ఉన్నారు.