Monday , September 16 2024

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి (స్పోక్ పర్సన్) గా మచ్చ శ్రీనివాస్

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి07:
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి( స్పోక్ పర్సన్ )గా మచ్చ శ్రీనివాస్ కి గురువారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నియామక పత్రాన్ని అందజేసినందుకు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు తుంకుంట నర్సరెడ్డికి మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ ,దుబ్బాక మున్సిపాలిటీ అధ్యక్షుడు నర్మెట్ట ఏసు రెడ్డి, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి ,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల భరత్, దేవుని రాజు, సలీం తదితరులు పాల్గొన్నారు.