Thursday , May 23 2024

శివరాత్రి పర్వదినం సందర్భంగా ముస్తాబైన ఆలయాలు

తెలంగాణ కెరటం:(దుబ్బాక):మార్చి07
దుబ్బాక పట్టణం తోపాటు పలు గ్రామాల్లో శివాలయాలు మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల నిర్వహకులు అందంగా ముస్తాబు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని నీలకంఠ, సోమేశ్వర ఆలయలాల్లో శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.దేవాలయంలోకి వచ్చే భక్తులకు తోపులాటలు జరగకుండా భక్తులకు క్యూ ఏర్పాట్లు చేశారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని శివాలయాల్లో శివరాత్రి రోజున అర్చనలు, అభిషేకాలు ఆయా ఆలయాల అర్చకులు వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాసాలు చేసి సాయంత్రం శివాలయాలకు చేరుకుని శివున్ని దర్శించుకుని ఉపవాసాలు విరమిస్తారు. రాత్రి శివనామ స్మరణతో జాగరణ చేస్తారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సం ఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయా ఆలయాల నిర్వాహకులు కోరారు.