Wednesday , July 24 2024

“ గృహ జ్యోతి ” ఉచిత విద్యుత్ అమలు..!

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి03:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకం క్రింద సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డులలో ఆదివారం రోజున దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు
దుబ్బాక మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా – కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్,విజయ్ కుమార్, శశి కుమార్, పరశురాములు గౌడ్, ప్రవీణ్ గౌడ్,అనంతుల స్వామి, విద్యుత్ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి విద్యుత్ బిల్లును కొట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలో విద్యుత్ బిల్లులు కొట్టగా మార్చి నెల నుండి జీరో బిల్లు వస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ అమలు చేయడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లును చెల్లిస్తేనే ఈ పథకం అమలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.పాత బకాయిలను వెంటనే చెల్లించి ప్రభుత్వం అందిస్తున్న గృహ జ్యోతి ఉచిత కరెంటు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.