తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి03:
ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు, గొల్లపల్లి సంకేత్ శర్మకు సర్ సీవీ రామన్ అకాడమీ వారి సేవా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పురస్కారాన్ని అందజేశారు. సంకేత్ శర్మ జ్యోతిష్య వాస్తు రంగంలో అందిస్తున్న సేవలకు గాను సంస్థ వారి రుద్రాక్ష వైభవం పేరిట ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆదివారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సర్ సివి రామన్ అకాడమీ వారి సేవా సంస్కృతిక విభాగం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట వ్యక్తులకు పురస్కారాలు, గండపెండేరాల ప్రధానం కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా జ్యోతిష్య వాస్తు విభాగంలో సంకేత్ శర్మకు ఈ పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. కాగా తనకు పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా తన బాధ్యతను మరింత పెంచి, సమాజ శ్రేయస్సుకు తన వంతు కృషి చేసేలా ప్రోత్సహించినట్లు అయిందని సంకేత్ శర్మ పేర్కొన్నారు.