Tuesday , July 16 2024

చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించండి

తెలంగాణ కెరటం:(దుబ్బాక)మార్చి03:
చిన్నారుల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలని ప్రతి తల్లిదండ్రులు 0-5 సంవత్సరాల పిల్లలకి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయుష్ డిపార్ట్మెంట్
తిమ్మాపుర్ హాస్పిటల్ డాక్టర్ యాదగిరి
తెలిపారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. నేడు పోలియో చుక్కలు వేయించని పిల్లలకి మరుసటి రోజు వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులు తప్పక గుర్తించాలని తెలిపారు.చిన్నారులకు పోలియో చుక్కలను వేయించడం ద్వారా వారిలో అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ పి లు శిరీష,కవిత పలువురు ఉన్నారు.