Wednesday , September 18 2024

-మొలకెత్తుతున్న ధాన్యం

దిక్కుతోచని స్థితిలో రైతులు

ఐకేపీ కేంద్రలో నత్త నడకన ధాన్యం కొనుగోలు

తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని అన్నదాతల డిమాండ్

తెలంగాణ కెరటం: దౌల్తాబాద్ /రాయపోల్ :ప్రతినిధిమే 20
నాలుగు రోజుల నుండి కురుస్తున్న ఆకాల వర్షాల వల్ల అన్నదాతను ఆగమాం చేస్తుంది. గత వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసిన చీమ శాతం ఎక్కువగా ఉందని వడ్లు కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయని వర్షాలకు మొలకలు వస్తున్నాయని దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు తొందరగా చేపట్టకపోవడంతో వడ్ల పై కప్పిన టార్పిలిన్ పై నీటిని ఎత్తిపోయడం, మళ్లి కప్పుడం రైతులకు ప్రతి రోజు తప్పడం లేదు రైతులు పండించిన ధాన్యం త్వరగా కొంటమని అంటున్న ప్రభుత్వం అకాల వర్షలతో అన్నదాత బతుకులు ఆగమగుతున్నాయి. మండలంలోని కొత్తపల్లి గ్రామ ఐకేపీ కేంద్రంలో రైతుల వడ్లు మొలకలు రావడంతో ఆందోళన చెందున్నారు అధికారలు తమ గోడును ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామ రైతులు ములకెత్తిన వడ్లను చూపిస్తూ బోరుమంటున్నారు అధికారలునిర్లక్ష్యం ఫలితంగా తమ పరిస్థితులకు కారణమని రైతులు ఆందోళన వ్యకం చేస్తున్నారు. ఓవైపు కొనుగోలులో ఆలస్యం మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండటంలోని చాల గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వడ్లను బహిరంగ ప్రదేశాల్లో అరబేడుతున్న దాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి ఆ తర్వాత కూడా వడ్లు ఆరే పరిస్థితి లేకపోవడంతో ధాన్యం మొలకెత్తి రైతులకు గుండేకొతను మిగిలిస్తుంది. ఇప్పటికైన అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మండల రైతులు కోరుతున్నారు.