Wednesday , July 24 2024

జిల్లా వెయిట్ లిఫ్టిగ్ అసోసియేషన్ నూతనకమిటీ ఎన్నిక

జిల్లా ఛైర్మెన్ గా రవికుమార్,

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి

తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తి కేపిఆర్ కన్వెన్షన్ హాలు లో జరిగాయి.సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాకం సాయిలు సమక్షం లో రాష్ట్ర సంఘం ఎన్నికల పరిశీలకుడు జి రాజయ్య,జిల్లా ఎన్నికల అధికారి బాబు శ్రీనివాస్ ల పర్యవేక్షణలో జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి.జిల్లా కమిటీ ఎన్నికలు ఏక గ్రీవంగా జరిగాయి.జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఛైర్మెన్ గా రిటైర్డ్ సిబిసిఐ డి అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్( బెల్లంపల్లి),ప్రెసిడెంట్ గా మార్కనవీన్ కుమార్(మంచిర్యాల),వైస్ ప్రెసిడెంట్ గా ఎం డీ గౌస్( బెల్లంపల్లి),ఎండీ షకీల్(బెల్లంపల్లి),జెనరల్ సెక్రెటరీ గా న్యాయవాది లింగంపల్లి శరత్ బాబు(రామకృష్ణాపూర్),జాయింట్ సెక్రటరీలు గా యాదండ్ల బలరామ్ యాదవ్( బెల్లంపల్లి), జె సంతో ష్ కుమార్( మంచిర్యాల),కోట లక్ష్మణ్( మంచిర్యాల), కోషాది కారిగా మారెపల్లి కుమార్( రామకృష్ణాపూర్),లు ఎన్నకయ్యారని జిల్లా ఎన్నిల అధికారి ప్రకటించారు.జిల్లా కార్యవర్గ సభ్యులు గా మందల భాస్కర్ గౌడ్ (ఇందారం), మారెపల్లి సతీష్ కుమార్ (రామకృష్ణాపూర్) యాదడ్ల భాస్కర్( బెల్లంపల్లి),తోటపల్లి శ్రావణ్ ( బెల్లంపల్లి), కె వెంకటేష్,కట్ట కిషన్( బెల్లంపల్లి), దుర్గం రాజేష్ ( బెల్లంపల్లి), ఎస్ కె రాజ్ మహ్మద్ ( బెల్లంపల్లి),పత్తి పాక రాజేష్ (బెల్లంపల్లి) లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి వివరించారు.