Thursday , May 23 2024

బైండోవర్ చేసినా తగ్గని డీజే ల జోరు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-03

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ప్రతి మండలం లో డీజే సౌండ్ సిస్టం యజమానులను ఇటీవల పోలీసులు స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు అయినా కూడ జిల్లా లో డీజే ల జోరు తగ్గడం లేదు ఎవరైనా 100 కు ఫోన్ చేయగానే తక్షణమే పోలీసులు స్పందించి డీజే లను బంద్ చేపిస్తున్న కూడా కానీ కొంత మంది రాజకీయ నాయకుల అండదండలతో వేకువజాము వరకు డీజే లు మోగిస్తూ తప్ప తాగి రోడ్డు పై డాన్స్ లు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురించేస్తున్నారు
డీజే నిర్వాహకులను వీధి ప్రజలు ఇబ్బంది గురించి అడిగితే తాగిన మైకంలో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతారోనని బయపడుతున్నారు అటువంటి డీజే లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు