Thursday , November 7 2024

మక్తల్ దుర్గా వైన్ షాప్ లో2000 నోటు చెల్లదు,అడిగిన వారిపై దాడికి ప్రయత్నించిన నిర్వాహకులు,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుర్గా వైన్ షాప్ దగ్గర కొందరు 2000 రూపాయలు నోటు తీసుకుని వెళ్లి మందు ఇవ్వాలని కోరడం జరిగింది, కానీ నీకు తెలివి ఉందా చదువుకున్నావా లేదా అంటూ వేల రూపాయలు నోటు తీసుకొచ్చిన వ్యక్తిపై అక్కడే ఉండే నిర్వాహకులు దాడికి ప్రయత్నించారు, వైన్ షాప్ ముందు 2000 రూపాయల నోటు చెల్లదు అంటూ బోర్డ్ ఏర్పాటు చేయడం జరిగింది, మీకు తెలవదా అన్నారు, అదేవిధంగా అటుగా వెళుతున్న మీడియా వార్తలు కవర్ చేయడానికి వీడియో రికార్డు చేస్తుంటే నిర్వాహకులు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు, ఈ వైన్స్ ఎవరిదో తెలవదా లేకపోతే మీ అంతో చూస్తామంటూ అధికారులకు ఏం చెప్తారో చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు, మరి మక్తల్ నియోజకవర్గంలో మూడు రోజుల ముందే 2000 రూపాయల నోటు చెల్లదు అంటూ బోడుపెట్టిన వైన్ షాప్ యజమానులపై చర్యలు తీసుకుంటారా లేక ఎక్స్చేంజ్ అధికారులు మామూళ్ల మత్తులో తవ్వుతారా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది,