దాశరథి కృష్ణమాచార్య జయంతి
కామారెడ్డి గ్రంధాలయం లో ఈ రోజు దాశరథి కృష్ణమాచార్య జయంతి జరుపుకోవడం జరిగింది
దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 – నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.
నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సిబ్బంది కపిల్ గణపతి మమత వసంత పాల్గొన్నారు