Tuesday , July 16 2024

పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగామోతె నరేష్ ఎన్నిక

తెలంగాణ కెరటం ఎప్రియల్ 10 దర్మపురి నియెాజకవర్గ ప్రథినిది

పీపుల్స్ పార్టి ఆప్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా జగిత్యాల జిల్లా దర్మపురి నియెాజక వర్గం ఎండపల్లి మండలం అంబారిపేట్ గ్రామానికి చెందినా మెాతె నరేష్ ను ఎన్నుకున్నారు పెద్దపల్లి, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) జాతీయ అధ్యక్షులు హేమరాజ్ సింగ్ పటేల్ ఆదేశాల మేరకు జాతీయ కార్యదర్శి హరీష్ సహారే చంద్రాపూర్ పార్టీ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోతునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మోతే నరేష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రదాన కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించిన జాతీయ కార్యదర్శి హరీష్ సహారే మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోతునూరి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. తన వంతుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.