నియామకపు పత్రం జారీ చేసిన జాతీయ అధ్యక్షులు “నల్లా రాధాకృష్ణ”
తెలంగాణ కెరటం మార్చి 23 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది
అవార్డు లా సెలెక్షన్ కమిటి మెంబర్ గా చుక్క గంగారెడ్డి నియమిస్తు నియమకపు పత్రం జారీచేసినా నల్లా రాదకృష్ణ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కు చెందినా చుక్క గంగారెడ్డి కి అవార్డులా సెలెక్షన్ కమిటి మెంబర్ గా నియమించారు ఈ సందర్బంగా గంగరెడ్డి గురించి సంస్థ జాతీయ అద్యక్షులు రాదకృష్ణ మాట్లాడుతు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకపోవడం
కోసం కృషి చేస్తున్న జాతీయ స్థాయి సంస్థ అయిన బహుజన సాహిత్య అకాడమి (బి.ఎస్.ఎ.) సంస్థను విస్తరింపజేసే దిశలో భాగంగా జగిత్యాల జిల్లా అవార్డు సెలక్షన్ కమిటి మెంబర్ గా “చుక్క గంగారెడ్డి” ని నియమిస్తూ సంస్థ జాతీయ అధ్యక్షులు “నల్లా రాధాకృష్ణ” శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పెర్కోన్నారు
చుక్క గంగారెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే తన పరిదిలోకి వచ్చే అన్ని కమిటీలను ఏర్పాటు చేసి జాతీయ కార్యలయానికి పంపించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. సామాజిక పరివర్తన, ఉద్యమ మార్గ దర్శకులు అయినటువంటి భగవాన్ బుద్ధ, మహాత్మ జ్యోతిరావు పులే, డా॥ బి.ఆర్. అంబేద్కర్, మాన్య శ్రీ కాన్షిరామ్ ల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, వారియొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకు పోవాలని అందులో సూచించారు.
ఈ యొక్క నియామకం రెండు సంవత్సరాల కాలపరిమితి వరకు వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.
ప్రముఖ ఉద్యమ కారునిగా, సీనియర్ జర్నలిస్ట్ గా, ఆర్టీఐ కార్యకర్తగా, పౌర హక్కుల, మానవ హక్కుల, వినియోగదారుల హక్కుల కార్యకర్తగా, అవినీతి రహిత సమాజ కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా చుక్క గంగారెడ్డి చేస్తున్న సేవలు గుర్తించి జగిత్యాల జిల్లా నుండి అవార్డ్ సెలక్షన్ కమిటీ మెంబర్ గా బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్, గుర్తింపుతో పాటు సేవారత్న నేషనల్ అవార్డ్ ను కూడా చుక్క గంగారెడ్డి అందుకున్న సంగతి తెలిసిందే.
చుక్క గంగారెడ్డి కి అందజేసిన నియామకపు పత్రం ప్రతిని జగిత్యాల జిల్లా కలెక్టర్ కు, జిల్లా పోలీస్ అధికారులకు, సాంస్కృతిక శాఖ అధికారులకు అందజేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో నల్లా రాధాకృష్ణ పేర్కోన్నారు