తెలంగాణ కెరటం ఎప్రియల్ 10 దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన మాజి ఎంపీటీసీ కాసారపు రాయలింగు గౌడ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ బుధవారం రోజు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రంగధాములపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శ్రీనివాస్ ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు బీమా సంతోష్, రేవల్ల సత్య నారాయణ గౌడ్, చిర్ర గంగాధర్, కాస గంగాధర్, కాసారపు అరవింద్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, జెల్ల అనిల్ యాదవ్, నేరళ్ల మహేష్, సత్యనారాయణ రెడ్డి, చిట్యాల శ్రీకాంత్, యూత్ మండల ఉపాధ్యక్షలు ఓర్సు విజయ్, విక్రమ్ రెడ్డి, కంది వెంకటేష్ తదితరులు ఉన్నారు.