Monday , September 16 2024

వాగు నుంచి దాసరి దొడ్డి గ్రామానికి త్రాగునీరు,

పైపులైను ప్రారంభించిన మక్తల్ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి.

తెలంగాణ కెరటం మక్తల్ మండల ప్రతినిధి.

మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది త్రాగునీటి పథకం ద్వారా మిషన్ భగీరథ నీరు వస్తున్నప్పటికీ నీరు సరిపోవడం లేదని గ్రామస్తులు పలమార్లు స్థానిక సర్పంచ్ దీవంగత గుళ్ల మారెప్పకు విన్నవించారు, సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యేకు పలుమార్లు పదేపదే చెప్పడంతో వెంటనే స్పందించిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన సొంత నిధులతో వర్కుర్ వాగు నుండి దాసరి దొడ్డి గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేయించి వాగులో మోటర్ ఏర్పాటు చేసి త్వరలోనే గ్రామానికి మీరు అందించడం కొరకు మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డిని అక్కడకు పంపి నేడు వాగు నుండి గ్రామానికి త్రాగునీటి కొరకు పైప్ లైన్ కు భూమి పూజ చేసి ప్రారంభించారు, గత కొన్ని రోజులుగా ఉన్న ఈ సమస్యను వెంటనే తీర్చడం కొరకు వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపినట్టు స్థానిక గ్రామస్తులు తెలిపారు, కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నదాసరి నర్సింలు ఉపసర్పంచ్ వడ్వాట్ రంగప్ప దివంగత సర్పంచ్ కుమారుడు రాజు శ్రీ వెంకటేష్ జి శీను వాబన్న నారాయణ ఎం వెంకటేష్ ఎం నర్సింలు ఎం దేవేంద్రప్ప కే వెంకటేష్ కే అంజనేయులు ఎం ఆంజనేయులు శంకర్ సి వెంకటేష్ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు,