Saturday , October 12 2024

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.??

 తెలంగాణ కెరటం, ఖమ్మం జిల్లా బ్యూరో, మే : 

 కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సివిల్ సప్లయి,అగ్రికల్చర్, పి ఎ సి ఎస్  , డి సి ఎం ఎస్ ,ఐకేపీ ఆధికారులతో ఎమ్మెల్యే కందాల   శనివారం రివ్యూ మీటింగ్ నిర్వహించి,నియోజకవర్గంలో తడిసిన ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు చేయాలని తదిత్వరగా కొనుగోలు చేసి,గోదాములకు తరలించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కందాళ ఉపేందర్ రెడ్డి  రైతులకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు,ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు.