Monday , September 16 2024

దేవుడు సొమ్ము అయినా పర్వాలేదు

బహిరంగంగానే హుండీకి కన్నం వేసిన ఉద్యోగి

సోషల్ మీడియా లో ఈవో కు పిర్యాదు చేసిన భక్తుడు

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో ఫోటో

ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి అక్టోబర్:-29

ఆయన రూటే సపరేటు ఆలయ ఉద్యోగే
దేవుడి హుండీ కి కన్నం కన్నం వేసిన సంఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగింది అక్కడ ఉద్యోగులు రోజుల తరబడి హుండీలోని డబ్బులు మాయం చేస్తూ ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న చివరికి
దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శిస్తుండగా సెల్ఫోన్లో చిట్రీకరించడం తో వారి నిజస్వరూపం బయటపడింది ఈ తతంగాన్ని ఆలయ ఈఓ కు సోషల్ మీడియా లో పిర్యాదు చేసినప్పట్టికి సదరు ఉద్యోగి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అతనికే వత్తాసు పలుకడం తో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఆలయ ఈఓ, హుండీ డబ్బులు కాజేసిన ఉద్యోగి పై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా
గట్టి భద్రత చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ విషయమై స్థానిక ఆలయ అధికారి మారుతి ని వివరణ కోరగా తన దృష్టికి ఎటువంటి విషయం రాలేదని ఒకవేళ వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు.తన చరవాణికి పంపిన వీడియో గురుంచి అడగడం తో
కొద్దిసేపటి తర్వాత ఆలయ అధికారి నాకు ఈ వీడియో ఇప్పుడే వచ్చింది ఆ విషయం పై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.