Tuesday , July 16 2024

కేంద్ర ప్రభుత్వం అన్నిటిలో తలదించుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. దేశంలో ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించొద్దు

దేశంలో ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించొద్దు

కేంద్ర ప్రభుత్వం అన్నిటిలో తలదించుకుంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరిగిన సందర్భాలు తెలిసిందే, వీటన్నిటికీ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇక ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించొద్దు అనే చూస్తుందని,ఆ కోణంలోనే ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయా…. భారత దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వేల కోట్లు రూపాయలను బ్యాంకులకు ఎగగొట్టి, ప్రభుత్వ సొమ్మును దోచుకొని విదేశాలకు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరి దగ్గర ఎంత సొమ్ము పోయిందని కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేసి, దానిని రికవరీ చేయకుండా..!? కనీసం శిక్షించలేని పరిస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ నేతల పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే కోణంలో కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనినే ప్రజాస్వామ్యం మీద దాడిగా , నిరంకుశత్వం కొనసాగుతుందని ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతూ, ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. దీనిపై ప్రధానమంత్రి స్పందించి భారత దేశ ప్రజలకు ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు, సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజాస్వామ్య దాడేనా లేక ప్రభుత్వం చేస్తున్న దాడా అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధాని మంత్రిపై ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించాల్సిన హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఎవరు తప్పు చేశారు ఎవరికి శిక్ష పడుతుంది అనేది దేశములోని ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు తప్పు చేసినా చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే.. దేశంలో ఎవరో ఒక్కరు తప్పు చేస్తే.. ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఉలికి పడాల్సిన అవసరమేంటి..?? ప్రభుత్వ ,ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ప్రభుత్వ సంస్థల పైన ఉంది. రాజకీయ నేతలపై సిబిఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తూ, దేశ సంపదను రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది..?? దేశ సంపదను విదేశాలకు తరలి వెళ్లకుండా..!? చూడాల్సిందే, ప్రత్యేకంగా పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పోకుండా రాజకీయ కోణంలో ఆలోచించకుండా దేశంలో ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలైన, రాజకీయ నేతలైనా, అధికార పార్టీకి చెందిన నేతలైనా దర్యాప్తు చేసి ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ప్రతిపక్షాలు రాసిన ఉత్తరంపై ప్రధానమంత్రి స్పందించి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి పైనే ఉంది. ఈడిని సిబిఐ ని స్వతంత్రంగా దర్యాప్తు చేసే సంస్థల్లగా చూస్తారా.. ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తారా..?? దీనిని ఏ కోణంలో ప్రజలు చూడాలో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *