Thursday , November 7 2024

డబుల్ ఇంజన్ కాదు డీజిల్ ఇంజన్ సర్కారు

  • రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్

తెలంగాణ కెరటం:మే 30 నిజామాబాద్ బ్యూరో


కేంద్రం లో బిజేపి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు డబుల్ ఇంజన్ సర్కారు కాదని డీజిల్ ఇంజన్ సర్కారు అని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఎద్దేవా చేశారు. గుజరాత్ బిజేపి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈవిధంగా గుర్తుచేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని ఆర్అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, 60 లక్షల కుటుంబాలు బిఆర్ఎస్ లో సభ్యత్వం పొందారని, పార్టీ పై ఉన్న నమ్మకం తో ఆకర్షితులవుతున్నారు. అనంతరం ఆర్మూర్ నియేజక వర్గం లోని మాక్లుర్,నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలలో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్

మర్యాద పూర్వకంగా కలిసిన
ఆర్టీసి చైర్మెన్ ఎమ్మెల్యే , బాజిరెడ్డి గోవర్దన్, జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు,నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజి ఎంఎల్సి గంగాధర్ గౌడ్,సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎటిఎస్ శ్రీనివాస్ , ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, ముదిరాజ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి సతీష్

ఈ కార్యక్రమంలో కార్మిక, ఉపాధి శాఖల మంత్రి వర్యులు మల్లారెడ్డి , MLC కల్వకుంట్ల కవిత , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ , స్థానిక ఎంమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి ,, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ విఠల్ రావు , మాజి MLC శ్రీమతి ఆకుల లలిత గారు, వివిధ సంస్థల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.