Wednesday , July 24 2024

కోర్టు ధిక్కరణ కేసులో కొమురం భీం జిల్లా కలెక్టర్ కి సోకాసు నోటీసులు…

తెలంగాణ కెరటం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రధాన ప్రతినిధి

వివరాల్లోకి వెళితే కొమురం భీం జిల్లా కలెక్టర్ కి నోముల రాజేందర్ గౌడ్ అనే సామాజిక కార్యకర్త ఆర్టిఐ ద్వారా జిల్లాలోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ల వివరాలు ,ఈఎస్ఐ ,ఈపిఎఫ్,జి ఎస్ టి,వివరాలు కావాలని కోరితే జిల్లా కలెక్టర్ అట్టి దరఖాస్తు ను ఏ. రవి క్రీష్ణ జిల్లా ఉపాధి కల్పన అధికారి కొమురం భీం గారికి RTI సెక్షన్ 6(3) కింద బదిలి చేసారని అయిన ఉపాధి కల్పన అధికారి ఇవ్వకపోవడం ,16000/- డీడీ కావాలని కోరడంతో 05.08.2023 రోజున 16000/- డీడీ నెంబర్ :069165 ఇవ్వడం జరిగింది అయిన సమాచారం ఇవ్వకపోవడం తో కోర్టులో పిటిషన్ వెయ్యగా WP.24477/2023 ,ఇస్తాను అని కోర్టు లో ఒప్పుకొని ఇవ్వకపోవడం తో మరల కోర్టు ధిక్కరణ కేసు CC. 48759/2023 వేసిన వెంటనే సమాచారం ఇస్తాము అని చెప్పి రాజేందర్ గౌడ్ ఇంటికి మందమర్రికి వెళ్లి కేస్ వాపస్ తీసుకోవాలని బెదిరించారు. 16000/-రూపాయలు తీసుకొని 2016,2017,2018,2019,2020,2021,2022 సమాచారం పంపించి చిట్ చేశారు దానిపై మందమర్రి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటి వరకు పోలీసుల ఏ. రవికృష్ణ పై చీటింగ్ కేసు నమోదు చెయ్యలేదు.మరొక సారి కొమురం భీం జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ బోరుకుడే IAS, ఏ. రవి క్రిష్ణ జిల్లా ఉపాధి కల్పన అధికారి పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం లో కోర్టు ధిక్కరణ కేసు వెయ్యగా తేదీ :07.03.2024 న వ్యక్తి గతంగా హాజరు అయ్యేలా వారికి నోటీసు ఇవ్వాలని కొమురం భీం జిల్లా జడ్జి గారికి ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది.
ఉన్నత అధికారులే కోర్టు ధిక్కారణలు చేస్తే సామాన్య ప్రజలకు ఎం సమాధానం ఇస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.