Wednesday , September 18 2024

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వరికుప్పల సుధాకర్

తెలంగాణ కెరటం,ఇబ్రహీంపట్నం,


రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా యాచారం మండలం మల్కిజ్ గూడ గ్రామానికి చెందిన వరికుప్పల సుధాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు పని చేస్తానని తెలిపారు. గత పది సంవత్సరాలు లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు విసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యాచారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మస్కు నర్సింహా, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు గౌరారం. వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ జ్యోతి శ్రీనివాస్ నాయక్ , సీనియర్ నాయకురాలు అమృత సాగర్, ఎంపీటీసీ లు లక్ష్మీపతి గౌడ్ ,జ్యోతి అరవింద్ నాయక్ ,మాజీ సర్పంచ్ లు పాండురంగా రెడ్డి, కవిత శేఖర్ గౌడ్ దూస రమేష్, గంగాలచ్చిరాంనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చర్ల సంపత్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటే శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ గడల మాధవిమల్లేష్, నక్క మహేందర్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.