Wednesday , July 24 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతా దయాకర్ రెడ్డి⁉️

నారాయణపేట జిల్లా అధ్యక్షులు కి సమాచారం ఇవ్వలేదంట⁉️

సీతమ్మ రాకనువ్యతిరేకిస్తున్న సీనియర్లు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీతా దయాకర్ రెడ్డి రాకను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలోకి వచ్చి కనీసం కష్టకాలంలో నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాకటి శ్రీహరి కి పిసిసి కార్యాలయం నుండి కనీసం సమాచారం ఇవ్వడం లేదని లేదా చేరే వారైనా కనీసం పార్టీలోకి వస్తున్నామని జిల్లా అధ్యక్షుడికి చెప్పాల్సిన బాధ్యత లేదా అని సీనియర్లు పూర్తిగా మండిపడుతున్నారు ఏదిఏమైనాప్పటికీ కాంగ్రెస్ గెలుస్తుంది మక్తల్ లో అనే అవకాశంతో కాంగ్రెస్లో చాలామంది చేరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కష్ట కాలంలో పనిచేసిన శ్రీహరికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలా ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సీనియర్ నాయకులు అంటున్నారు మరి పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.