Monday , September 16 2024

కాంగ్రెస్ నేతల జులుం

షబ్బీర్ అలీ ముఖ్య అనుచరుల వ్యాఖ్యలతో

షబ్బీర్ అలీ కి ముపెన

నువ్వు సామాన్య ఓటర్వి నన్నెంచేయగలవు ?

  • ఒక్క ఓటుతో నేనేమి ఓడిపోను
  • ఓటర్లను చులకన చేసి మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
  • నాయకుల తీరు కాంగ్రెస్కు కలిసొచ్చేనా
  • ఐదుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల తీరు మారదా
  • కెసిఆర్ రాకతో కాంగ్రెస్ నాయకుల మతిపోతుంది

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రభావంతో ప్రతి నాయకుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్న సమయంలో బిక్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి వెన్నంటి ఉండే నాయకుడు ఓ ఓటర్ను పట్టుకొని నువ్వు ఒక సామాన్య ఓటరువి నన్నేం పీక గలవు అని అసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా నువ్వు చేసే పనులు బిజినెస్ మాకు అన్ని తెలుసని ని అంతు చూస్తాను అనడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకుడు ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి కుల సంఘాలను కలుపుకుంటూ వాళ్లకు ప్యాకేజీలను ప్రకటిస్తూ వెళుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఓటరు పట్టుకొని సదర్ కాంగ్రెస్ నాయకుడు అలా మాట్లాడడం ఓటర్లలో విస్మయాన్ని కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా అతను ఓ హోదాలో కొనసాగుతున్నారు కాలనీ అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఈ విధంగా అతని దురుసుగా ప్రవర్తించడం గ్రామ ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ వరుస అపజయాలతో నిరసించే పోయి ఉంటే, ఈసారైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకుంటే ఓవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోటికి రావడం, మరోవైపు కాంగ్రెస్ నాయకుల తీరు ఆయన గెలుస్తారా అనే నమ్మకాన్ని సైతం దెబ్బతిస్తుంది.
కెసిఆర్ రాకతో కాంగ్రెస్ నాయకుల మతి చెల్లించిందా?

కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈసారి గంప గోవర్ధన్ పోటీ చేయడం లేదు. ఆ స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీకి రావడంతో అప్పటివరకు కాంగ్రెస్ నాయకుల్లో గెలుస్తామనే ఉన్న ధీమా ముఖ్యమంత్రి పోటీకే వస్తే ఎలా అనే సంక్షేమలో పడి వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.