Monday , September 16 2024

సివిల్ సప్లై అధికారి మిల్లలతో చేతులు కలిపినారా…??

సమాచారం అందించిన మిల్లర్ల అసోసియేషన్ వాహనాలు తిరుగుతున్న సివిల్ సప్లై అధికారి

వివరణ అడగగా వారం రోజుల క్రితం కాచాపూర్ రైస్ మిల్లుకు వచ్చినా అని చెప్పడం గమనార్హం

రిజిస్టర్లో సంతకం చేయని సివిల్ సప్లై అధికారి కిష్టయ్య

రిజిస్టర్లు ఫిబ్రవరిలో నెల సంతకం చేసినటువంటి అధికారి అధికారి కృష్ణయ్య

రైస్ మిల్ అసోసియేషన్లో పదవి అనుభవిస్తున్న తో కలసి పక్క దాటి పట్టిస్తున్న సివిల్ సప్లై అధికారి

ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతున్న సివిల్ సప్లై అధికారి

రైస్ మిల్లల అక్రమాలను బయటపెట్టాల్సిన అధికారి వారితో చేతులు కలుపుతున్నారా

నాలుగైదు రైస్ మిల్లు కలిసి ఆంధ్రాకు వడ్ల ధాన్యాన్ని సరఫరా చేసినటువంటి వైనం

వరి ధాన్యం రవాణాకి సహకరిస్తున్నటువంటి సివిల్ సప్లై అధికారి

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా క్రైమ్ జూలై10;

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన ఒక రైస్ మిల్లులో అక్రమంగా గత నెల రోజుల నుండి వరి ధాన్యం రవాణా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సమాచారం సివిల్ సప్లై అధికారులకు ఉన్నప్పటికీ కూడా దానిని స్పందించకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సోమవారం రోజున సమాచారం అందించగా సివిల్ సప్లై అధికారి ఎలాంటి వివరణ తీసుకోకుండానే రైస్ మిల్లర్లతో చేతులు కలిపి వారి యొక్క ప్రత్యేక వాహనాలు అనగా వాహనం నెంబరు TS 17F 1483 లో వచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నేను విచారణ చేస్తానంటూ చేతులు దులిపేసుకోవడం కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై అధికారి రైస్ మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ నేను ఎలాంటి విచారణ చేపట్టను అని చెప్పడం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సివిల్ సప్లై అధికారి పరిధిలో ఉన్న రైస్ మిల్లులను తనిఖీ చేయకుండా తనిఖీ చేసిన అని చెప్పడం ఉదాహరణలకు గమనిస్తున్నాయి సమాచారం ఉన్న రైస్ మిల్లును ఫిబ్రవరి నెల్లో దర్శించినారు కానీ సివిల్ సప్లై అధికారి వారం రోజుల క్రితం రైస్ మిల్లును సందర్శించడం జరిగింది చెప్పడం రిప్లై అధికారి మిల్లర్లకు ఇంతవరకు సహకరిస్తున్నారు అని అర్థమవుతుంది ఏదైతే రైస్ మిల్లర్లు పిడిఎఫ్ బియ్యాన్ని గోలు చేయడమే కాకుండా ది దానిని వచ్చినటువంటి లాభాన్ని పొందుతూ ఇతర రాష్ట్రాలకు వరి ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారుల యొక్క అండదండలతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి దృశ్యాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంగా మనం చూడవచ్చు ఈ అక్రమానికి అడ్డుకట్ట వేసేది లేరా అనే ప్రశ్నించగా సివిల్ సప్లై అధికారి మొహం చాటేస్తూ ఎలాంటి సమాచారం లేదని చెప్పడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పూర్తి వివరాలను కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సిందే